ముంబై, జూలై 5: దేశంలో పేదల సంఖ్య పెరిగిపోవడం పట్ల కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ధనికుల వద్దే సంపద అంతా కేంద్రీకృతమవుతోందని శనివారం నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇది మంచి పరిణామం కాదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగే విధంగా ఆర్థిక వ్యవస్థ పెరగాలని.. ప్రత్యామ్నాయ మార్గాలను తాము అన్వేషిస్తున్నామని తెలిపారు. సంపద వికేంద్రీకరణ జరగాలని, ఈ దిశగా అనేక మార్పులు జరిగాయని గడ్కరీ అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని ఆయన చెప్పారు.