ప్రయాగ్‌రాజ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలి మరణశిక్ష ఎదుర్కొనబోతున్న సురేంద్ర కోలీ, మోనిందర్ సింగ్ పంధేర్‌ను నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో ఉన్న నిఠారీలో వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంధేర్ ఇంటి వెనుక 2006లో ఎనిమిది మంది బాలల అస్థిపంజరాలు కనిపించాయి.
దీంతో ఆయనతోపాటు ఆయన వద్ద పని చేస్తున్న సురేందర్ కోలీపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఇదే ప్రాంతంలో మరికొందరు చిన్నారుల అస్థిపంజరాలు కనిపించాయి. నిందితులిద్దరిపైనా సీబీఐ 19 కేసులను నమోదు చేసింది. సాక్ష్యాధారాలు లేవని మూడు కేసుల్లో క్లోజర్ రిపోర్టులను దాఖలు చేసింది. వీరిద్దరూ దోషులని ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు తీర్పు చెప్పి, ఇరువురికీ మరణ శిక్ష విధించింది. దీనిపై వీరిద్దరూ అలహాబాద్ హైకోర్టులో అపీలు చేశారు. వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని, వీరు నిర్దోషులని హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.