Nirmala Sitharaman | గంటా 25 నిమిషాలు.. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే రెండో అతి చిన్నది..
Nirmala Sitharaman | చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు.
Nirmala Sitharaman | సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ సర్కార్ తొలి బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25కు (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో చదివి వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ పలు రికార్డులను బ్రేక్ చేశారు. వరుసగా ఏడో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఆరుసార్లు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును బ్రేక్ చేశారు.
ఇక చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు. కేవలం 85 నిమిషాలు మాత్రమే బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఉదయం 11గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలమ్మ 12:25కు తన ప్రసంగాన్ని ముగించారు. ఇప్పటి వరకూ నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే రెండో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగంగా (2nd Shortest Budget Speech) నిలిచింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈఏడాది ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిర్మలమ్మ కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో కల్లా ఇదే అతి చిన్నది. ఆ తర్వాత ఇవాళ ప్రసంగమే.
ఇక ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలమ్మకు రికార్డు ఉంది. ఆమె బడ్జెట్ ప్రసంగాల్లో 2020లో చేసిన బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఆ బడ్జెట్లోని కీలక ప్రకటనల్లో కొత్త ఆదాయపు పన్ను స్లాబులు, ఎల్‌ఐసీఐపీవో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలపై ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు.
బడ్జెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టిన 2019లో ఆమె ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఇది రెండో అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం. ఆ ఏడాది కేంద్ర బడ్జెట్ ను తొలిసారిగా పూర్తిస్థాయిలో నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. ఇక గతేడాది 87 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. గతేడాదితో పోలిస్తే తాజా బడ్జెట్ ప్రసంగం రెండు నిమిషాలు తక్కువ.
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాలు..
- 2019లో.. 137 నిమిషాలు (2 గంటల 17 నిమిషాలు)
- 2020లో.. 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు)
- 2021లో.. 110 నిమిషాలు (గంట 50 నిమిషాలు)
- 2022లో.. 93 నిమిషాలు (గంట 33 నిమిషాలు)
- 2023లో.. 87 నిమిషాలు (గంట 27 నిమిషాలు)
- 2024లో.. (మధ్యంత బడ్జెట్) 56 నిమిషాలు
- 2024లో.. (పూర్తిస్థాయి బడ్జెట్) 85 నిమిషాలు (గంట 25 నిమిషాలు)
ఏడోసారి బడ్జెట్.. రికార్డు బ్రేక్ చేసిన నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రికార్డు సృష్టించారు (make history). వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను సమర్పించి.. రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఆరు వార్షిక బడ్జెట్లు ప్రవేశ పెట్టిన రికార్డు నమోదైంది. 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ ప్రవేశ పెట్టారు.
కాగా, మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.
Also Read..
Nirmala Sitharaman | ఏడోసారి బడ్జెట్.. రికార్డు బ్రేక్ చేసిన నిర్మలమ్మ
Nirmala Sitharaman | మరోసారి చేనేత చీరలోనే.. బడ్జెట్ వేళ తెలుపురంగు చీరలో నిర్మలమ్మ
Union Budget 2025 | ఏపీకి వరాల జల్లు.. తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

