ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సంవత్సరం చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో నిర్మలా 37వ స్థానంలో ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ రెండో స్థానంలో నిలిచారు. అత్యంత శక్తివంతమైన మహిళగా మొదటి స్థానంలో అమెరికాకు చెందిన మెకెంజీ స్కాట్ నిలిచారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ 5వ స్థానం పొందారు. అయితే గత సంవత్సరం నిర్మలా సీతారామన్ ఇదే 41 స్థానంలో ఉండగా.. ప్రస్తుతం నాలుగు స్థానాలుపైకి ఎగబాకడం గమనార్హం.
మరోవైపు భారతదేశం నుంచి నైకా సంస్థ వ్యవస్థాపకురాలు, CEO ఫల్గుణి నాయర్ 88వ స్థానంలో నిలిచారు. ఆమె ప్రస్తుతం భారతదేశం ఏడవ మహిళా బిలియనీర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్ ర్యాంకింగ్స్‌లో ఇతర భారతీయ వ్యాపారవేత్తలు రోషిణి నాడార్ (52), కిరణ్ మజుందార్-షా (72) స్థానంలో నిలిచారు.