చెన్నై, మార్చి 16 : భాష విషయంలో సడలని వైఖరిని ప్రదర్శించడం కోసమే తాము తమిళ రుపీ చిహ్నాన్ని ఉపయోగించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. దీనిపై వివాదం రేపుతున్న వారిని తీవ్రంగా ఎండగట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఈ చిహ్నాన్ని ఉపయోగించారని, ఇంగ్లిష్ ‘ఆర్ఈ’కి బదులుగా తమిళ ‘రు’ను వాడారని గుర్తు చేశారు. రాష్ట్ర 2025-26 బడ్జెట్లో అధికారిక రుపీ చిహ్నానికి బదులుగా, తమిళ ‘రు’ అక్షరాలను వాడటం సరైనదేనని ఎక్స్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.