Pre Budget Consultations : 2004-25 ఆర్ధిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఢిల్లీలో ఆర్ధిక వేత్తలతో సంప్రదింపులు జరిపారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్ధిక వేత్తలతో జరిగిన భేటీకి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమావేశానికకి ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఆర్ధిక కార్యదర్శి, ఆర్ధిక వ్యవహారాలు, రెవెన్యూ, ఆర్ధిక సేవలు, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శులు, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారులు కూడా హాజరయ్యారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇక రానున్న బడ్జెట్లో ఎకానమీలో ఉత్తేజం పెంచేందుకు, మధ్యతరగతికి ఊరట ఇచ్చేలా పన్ను శ్లాబ్‌లను సవరించవచ్చని భావిస్తున్నారు. వ్యవసాయం, నీటి పారుదల, మౌలిక వసతుల రంగాలకు సంబంధించి పలు ప్రోత్సాహక చర్యలు చేపట్టవచ్చని చెబుతున్నారు. కాగా, వచ్చే నెలలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Read More :