Moon Walk | భారతీయ చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేర్లు ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా. ఒకరు తన సంగీతంతో ఆస్కార్ అవార్డు అందుకోగా.. మరోకరు తన డ్యాన్స్‌తో ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన ప్రేమికుడు, లవ్ బర్డ్స్ తదితర చిత్రాలు బ్లాక్ అందుకున్నాయి. అయితే దాదాపు 25 ఏళ్ల తర్వాత ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రభుదేవ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం మూన్ వాక్ (Moon Walk). ఈ సినిమాకు మనోజ్ ఎన్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రెహమాన్ ఎక్స్ వేదికగా విడుదల చేశాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవాతో పాటు, యోగి బాబు, అజు వర్గీస్, అర్జున్ అశోక్, చాట్స్, నిష్మా, సుస్మితతో పాటు ఇతర ప్రముఖ తారలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మనోజ్ ఎన్ఎస్, దివ్య మనోజ్, ప్రవీణ్ ఇలాక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
MOON WALK
Starring @PDdancing @iYogiBabu @AjuVarghesee #ArjunAshokan @Satzsathish321 @NishmaChengapp5 #SushmithaNayak #arrpd6 #moonwalk
Produced by @behindwoods
Directed by #ManojNS pic.twitter.com/TFO6yAPJrt— A.R.Rahman (@arrahman) June 19, 2024