Bihar | బీహార్‌లో నిర్భయ తరహా గ్యాంగ్ రేప్..బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్ పై అమానుష దాడి
బీజేపీ పాలిత బీహార్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది! బెగుసరాయ్ జిల్లాలో ఒక మహిళపై ‘నిర్భయ’ తరహా సామూహిక లైంగికదాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధిత మహిళ మర్మాంగంలో ఒక తూటా, గులకరాళ్లు, కర్రను చొప్పించి దారుణంగా హింసించినట్టు వైద్య పరీక్షల్లో తేలింది.
- బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్ పై అమానుష దాడి
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
లక్నో, జూన్ 18: బీజేపీ పాలిత బీహార్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది! బెగుసరాయ్ జిల్లాలో ఒక మహిళపై ‘నిర్భయ’ తరహా సామూహిక లైంగికదాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధిత మహిళ మర్మాంగంలో ఒక తూటా, గులకరాళ్లు, కర్రను చొప్పించి దారుణంగా హింసించినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. చకియా పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 11న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన.. ఢిల్లీలోని నిర్భయ ఉదంతం తాలూకు భయానక జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేస్తున్నది.
ఘటన అనంతరం దవాఖానలో చేరిన బాధితురాలు నుంచి ఫిర్యాదు అందినా.. పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని, దవాఖానకు పంపి చేతులు దులుపుకొన్నారని బాధితురాలు వాపోయారు. రెండోసారి దవాఖానకు వెళ్లగా..అంతర్గతంగా తీవ్ర గాయాలైన సంగతి వెలుగుచూసింది. నెల క్రితం తనపై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడటమేగాక, లైంగికదాడికి యత్నించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ ఘటనను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది.
ఈ కేసు రాష్ట్రంలో పెను సంచలనంగా మారటంతో.. ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఫోరెన్సిక్ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఘటనపై జిల్లా ఎస్పీ మనీశ్‌కుమార్ మాట్లాడుతూ, ‘బాధితురాలి ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటుచేశాం’ అని అన్నారు. జూన్ 11 రాత్రి టాయిలెట్ కోసం ఇంటి నుంచి బయటకు రాగా, ఐదుగురు వ్యక్తులు తనను బలవంతంగా ఒక నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారని ఆమె తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

