చెన్నై: చెన్నైలోని ‘ఎన్నోర్’ థర్మల్ విద్యుత్ ప్లాంట్లో ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడ 30 అడుగుల ఎత్తులో నిర్మాణం జరుపుకుంటున్న పైకప్పు హఠాత్తుగా కుప్పకూలి 9మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతిచెందిన కార్మికులు అస్సాంకు చెందినవారిగా తెలిసింది. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు గల కారణం ఏంటన్నది తెలియరాలేదు.