దలియాన్: చైనాలో ఘోర అగ్నిప్రమాదం ( Fire Accident ) జరిగింది. ఈశాన్య చైనాలోని దలియాన్ నగరంలో ఓ మార్కెట్ అండర్ గ్రౌండ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మది మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా ఒకరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగతా నలుగురికి చికిత్స కొనసాగుతున్నది. అండర్‌గ్రౌండ్‌లో మంటలు చెలరేగాయనే సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మృతిచెందిన తొమ్మిది మందిలో ఒకరు ఫైర్ మ్యాన్ ఉన్నారు.