ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత

- తమిళనాడులో 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మార్కెట్లో దుకాణాలకు సరి, బేసి ప్రకారం తెరవాలనే నిబంధన కూడా తీసేసింది. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లను 50 శాతం సామర్థ్యంతో నడుపుకొనేలా అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బడులు, కాలేజీలు మాత్రం మూసే ఉంటాయి. పెండ్లికి 200 మంది దాకా హాజరు అయ్యేందుకు వెసులుబాటు కల్పించారు. కాగా, తమిళనాడులో స్కూళ్లు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరువనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తున్నట్టు తెలిపింది. పెండ్లికి 100 మంది, అంతిమ యాత్రలకు 50 మంది దాకా మాత్రమే హాజరు కావాలని నిబంధన విధించింది.
జైశంకర్కు కరోనా
విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలిసి వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Night Curfew
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

