Mamata Banerjee: ఉరి వేసుకుని మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య
Mamata Banerjee: మమతా బెనర్జీ మేనకోడలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. బాధితురాలు పేరు బ్రిస్టీ ముఖర్జీ. ఆమె వయసు 28 ఏళ్లు. బీర్భమ్లోని రాంపూర్హట్లో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. టీచర్ ఉద్యోగం కోల్పోవడంతో బ్రిస్టీ మానసిక సమస్యతో బాధపడుతున్నది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. బాధితురాలు పేరు బ్రిస్టీ ముఖర్జీ. ఆమె వయసు 28 ఏళ్లు. బీర్భమ్లోని రాంపూర్హట్లో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. టీచర్ ఉద్యోగం కోల్పోవడంతో బ్రిస్టీ మానసిక సమస్యతో బాధపడుతున్నది. 2023 మార్చిలో బోల్పుర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బందిలో ఆమె చేరింది. కానీ టీచర్ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగినట్లు రుజువు కావడంతో సుమారు 26 వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకుని ఫేవర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీచర్ల నియామకాన్ని కోల్‌కతా హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుసుంబ గ్రామానికి చెందిన బ్రిస్టీ ముఖర్జీ తండ్రి నిహార్ ముఖర్జీ. ఆయన మమతా బెనర్జీకి సోదరుడు అవుతాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నేతగా ఉన్నారు. అయితే టీచర్ల రిక్రూట్మెంట్పై కోర్టు తీర్పు తర్వాత బ్రిస్టీ తీవ్ర క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలో ఆమె 608వ స్థానంలో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

