Rashid Engineer | ఎంపీగా ప్రమాణ స్వీకారానికి రషీద్ ఇంజినీర్‌కు ఎన్ఐఏ అనుమతి
జైలులో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన రషీద్ ఇంజినీర్‌కు (Rashid Engineer) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది.
న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన రషీద్ ఇంజినీర్‌కు (Rashid Engineer) ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది. అయితే మీడియాతో మాట్లాడ కూడదని షరతు విధించింది. కాగా, షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జమ్మూకాశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు రషీద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. టెర్రరిస్టులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింది ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

