న్యూఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ రువాండాలో పట్టుబడ్డాడు. ఇంటర్పోల్ సహకారంతో భారత దర్యాప్తు సంస్థలు అతడ్ని భారత్కు రప్పించగలిగాయి.
రువాండా రాజధాని కిగాలిలో అతడిని అరెస్ట్ చేశారు. రువాండా ఇన్వెస్టిగేషన్ బ్యూరో, నేషనల్ సెంట్రల్ బ్యూరో అతడ్ని భారత్కు తరలించగా, గురువారం ఉదయం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది.
బెంగళూరు జైల్లో ఉండగా అతడు పలు ఉగ్రవాద దాడులకు వ్యూహం పన్నాడని, ఆయుధాలు, మందుగుండు సమకూర్చాడని ఆరోపణలున్నాయి. నిందితుడు దేశం విడిచి పారిపోవటంతో, అతడిపై ఆగస్టు 2న రెడ్ నోటీస్ జారీ అయ్యింది.