న్యూఢిల్లీ : రోడ్ల నిర్వహణను చురుగ్గా నిర్వహించే చర్యల్లో భాగంగా అత్యాధునిక ఏఐ ఆధారిత డ్యాష్‌క్యామ్ పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. సుమారు 40 వేల కిలోమీటర్ల పరిధిని ఈ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించనుంది.
నిర్వహణ సామర్థ్యాన్ని, భద్రతా ప్రమాణాలను పెంచడం, రియల్ టైమ్‌లో రోడ్ల పరిస్థితులను ట్రాకింగ్ చేయడం కోసం ఆటోమేటిక్ సర్వే పరికరాలు, డాటా కలిగిన ఈ వ్యవస్థను అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తున్నది. ఈ వ్యవస్థలో డ్యాష్‌క్యామ్ అనలిటిక్స్ సర్వీసెస్, లీవరేజెస్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ద్వారా హైవేల్లోని పరిస్థితులను పరిశీలిస్తారు.