న్యూఢిల్లీ, అక్టోబర్ 24: నేషనల్ హైవే వినియోగదారులలో పారదర్శకతను పెంచి, అవగాహన కల్పించేందుకు టోల్ ప్లాజాల వద్ద నెలవారీ, వార్షిక పాసుల సమాచారాన్ని ప్రదర్శించనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) శుక్రవారం ప్రకటించింది. జాతీయ హైవేలపైన ఉన్న అన్ని టోల్ ఫీ ప్లాజాల వద్ద లోకల్ పాసులు, వార్షిక పాసుల గురించి పూర్తి సమాచారాన్ని ప్రముఖంగా ప్రదర్శించాలని తన ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీచేసినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది.
టోల్ ప్లాజాకు సమీపంలోని ప్రదేశాలు, కస్టమర్ సర్వీస్ ప్రాంతాలు, ఎంట్రీ లేదా ఎగ్టిట్ పాయింట్లతోసహా ప్రజలకు స్పష్టంగా కనిపించే ప్రదేశాలలో సైనేజీ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ పేర్కొంది. వీటిపైన హిందీ, ఇంగ్ల్లిష్తోపాటు ఒక స్థానిక ప్రాంతీయ భాషలో సమాచారం ఉంటుందని తెలిపింది. 30 రోజుల్లోపల వీటిని ఏర్పాటు చేయాలని, పగలు, రాత్రి ఇవి వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఉండాలని ఎన్హెచ్ఏఐ తన ఫీల్డ్ అధికారులను ఆదేశించింది.