NHAI | జాతీయ రహదారుల (National Highwasy)పై వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా దాదాపు వంద టోల్ ప్లాజా (Toll Plaza’s) జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి పర్యవేక్షించనున్నది. ఈ విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెల్లడించింది. 1033 నేషనల్ హైవే హెల్ప్లైన్ల ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ టోల్ ప్లాజాలు ఎంపిక చేసినట్లు పేర్కొంది. లైవ్ మానిటరింగ్ సిస్టమ్ రియల్ టైమ్‌లో రద్దీపై వాహనదారులకు హెచ్చరికలు చేయనున్నది. టోల్‌ప్లాజా వద్ద వాహనాల క్యూలు నిర్దేశించిన పరిమితిని మించి ఉంటే లేన్ సర్దుబాటులపై సిఫారసులు చేయనున్నది. మరిన్ని టోల్ ప్లాజాలను కవర్ చేయడానికి ఈ మానిటరింగ్ సేవ క్రమంగా విస్తరించబడుతుందని ప్రకటనలో పేర్కొంది.
టోల్‌ప్లాజాల పేరు, ప్రదేశంతో పాటు ఎన్ని మీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ ఉంది. నిరీక్షణ సమయం, వాహనాల వేగం వివరాలను జీఐఎస్ సాఫ్ట్వేర్ అందివ్వనున్నది. అంతేకాకుండా ఇది రద్దీ హెచ్చరికలను జారీ చేస్తుంది. క్యూలు ఎక్కువగా ఉంటే పరిమితిని మించి ఉంటే లేన్ మార్పులను సూచించనున్నాయి. ఇది కాకుండా, సాఫ్ట్వేర్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, స్థానిక పండుగల గురించి కూడా అప్డేట్లను అందిస్తుంది. ఇది ఎన్హెచ్ఏఐ అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు, టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు చురుకైన చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.