బెంగళూరు, జూలై 24: కర్ణాటకలో సీఎం మార్పు మలుపులు తిరుగుతున్నది. కొత్త సీఎం ఎంపిక బీజేపీ జాతీయ నాయకత్వానికి, ఆర్ఎస్ఎస్ కు తలనొప్పిగా మారింది. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన సీఎం యెడియూరప్ప.. నాన్ లింగాయత్ను తదుపరి సీఎం చేయాలని సూచించారు. ఆయన స్థానాన్ని నాన్ లింగాయత్తో భర్తీ చేయాలని బీజేపీ యోచిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి అండగా నిలిచిన లింగాయత్ కమ్యూనిటీ నుంచే తదుపరి సీఎంని ఎంపిక చేయాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తున్నది.