న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం కొత్త సరళీకృత పింఛను దరఖాస్తు ఫారాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ఆవిష్కరించారు. 9 వేర్వేరు ఫారాలను కలిపి, ఒకే ఫారంగా రూపొందించారు. దీనిని ఫారం 6ఏ అంటారు. ప్రజలు, పింఛనుదారుల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన మరొక చర్య ఇది అని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు భవిష్య / ఈ-హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్స్‌లో ఈ ఫారం-6ఏ అందుబాటులో ఉంటుందని తెలిపారు.