కొత్త లోక్‌సభ, రాజ్యసభ హాల్స్.. ఫోటోలు రిలీజ్
New Parliament Building : అత్యుద్భుతంగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోంది. లోక్‌సభ, రాజ్యసభ హాల్స్‌కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్‌సభలో 888 మంది సభ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోటస్ థీమ్ తరహాలో రాజ్యసభను డిజైన్ చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌కు చెందిన లేఅవుల్, ఫోటోలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ సముదాయ బిల్డింగ్‌లను బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మార్చిలో ఈ బిల్డింగ్‌లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. అత్యంత విశాలమైన హాల్స్, లైబ్రరీతో పాటు పార్కింగ్‌కు కావాల్సినంత స్థలాన్ని కల్పిస్తున్నారు. హాల్స్, ఆఫీసు రూములన్నీ ఆధునిక టెక్నాలజీకి తగ్గట్టు నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనంలో 888 సీట్లు కెపాసిటీతో లోక్‌సభ హాల్‌ను నిర్మించారు. ఇక రాజ్యసభ హాల్‌ను లోటస్ థీమ్ తరహాలో నిర్మించారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే రీతిలో దీన్ని కట్టారు.

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనాల సమీపంలోనే కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ను నిర్మించారు. కొత్త బిల్డింగ్ 65వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అన్ని హంగులతో కాన్స్టిట్యూషన్ హాల్‌ను తీర్చిదిద్దారు. లేటెస్ట్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీతో అన్ని ఆఫీసుల్ని నిర్మించారు. కమిటీ రూముల్లో అత్యాధునిక ఆడియో విజువల్ సిస్టమ్స్ ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

