న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉచిత ఎన్నికల గుర్తులను విడుదల చేసింది. మొత్తం 193 ఉచిత ఎన్నికల గుర్తులతో నూతన జాబితాను ప్రకటించింది. స్వతంత్ర అభ్యర్థులుగా, గుర్తింపు లేని పార్టీల తరఫున అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీచేసే వారు ఈ ఉచిత ఎన్నికల గుర్తుల జాబితాలోంచే తమకు నచ్చిన గుర్తును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఉచిత ఎన్నికల గుర్తులతో కొత్తగా విడుదల చేసిన జాబితాలో బేబీ వాకర్, చేతి కర్ర, ఎయిర్ కండిషనర్, బెలూన్, గాజులు, ఒంటి చక్రం బండి, విజిల్, కిటికీ, ఉన్ని, సూది, పుచ్చపండు, వాల్నట్, పర్సు, వయొలిన్, వ్యాక్యూమ్ క్లీనర్, ట్రంపెట్ తదితర గుర్తులు ఉన్నాయి. అంతేగాక ఆ జాబితాలో బీరువా, గ్యాస్ లైటర్, అల్లం గుర్తులకు కూడా చోటు కల్పించారు.