30న కర్ణాటకకు కొత్త సీఎం.. నేడు సిద్ధరామయ్య రాజీనామా?
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం(మే 28) సాయంత్రం 3 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన రాజీనామా సమర్పించడానికి గురువారం సాయంత్రం 3 గంటలకు ఆయన రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరినట్లు వర్గాలు తెలిపాయి.
- సాయంత్రం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం
- ముఖ్యమంత్రిగా డీకేకు అవకాశం
బెంగళూరు, మే 27 : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం(మే 28) సాయంత్రం 3 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన రాజీనామా సమర్పించడానికి గురువారం సాయంత్రం 3 గంటలకు ఆయన రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరినట్లు వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంతో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఊహించిన ఈ చర్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి మార్గం సుగమం చేయనున్నది. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య తనకు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే కూడా బుధవారం ధృవీకరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పోరు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరగనున్నది.
30న డీకే ప్రమాణం
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మే 30న ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి డీకేకు పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇప్పటివరకు వెలువడనప్పటికీ సిద్ధరామయ్యను రాజీనామా చేయవలసిందిగా పార్టీ అధిష్ఠానం మంగళవారం నాటి సమావేశంలో ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. అందుకు ప్రతిగా ఆయనకు రాజ్యసభ స్థానంతోపాటు జాతీయ స్థాయిలో పార్టీలో కీలక పాత్రను ఇవ్వడంతోపాటు ఆయన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడానికి అధిష్ఠానం సంసిద్ధత తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో చర్చల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చించలేదని, కర్ణాటకలో రానున్న రాజసభ, ఎంఎల్సీ ఎన్నికల గురించి మాత్రమే చర్చించామని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో ఎంత గోప్యతను పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఊహాగానాలు మాత్రం అధికార మార్పిడినే సూచిస్తున్నాయి.
ఎందుకీ రచ్చ?
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యతతో గెలుపొందింది. ఈ విజయం అనంతరం కాంగ్రెస్ నాయకులైన డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య అధికారాన్ని పంచుకునే ఒప్పందం కుదిరినట్లు వదంతులు వినిపించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం ఎన్నికల్లో గెలిచిన పదవీకాలంలో మొదటి రెండున్నర సంవత్సరాలపాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండాలి. అయితే రెండున్నర సంవత్సరాల పదవీకాలం పూర్తికావడానికి ఒక వారం ముందే రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య అంగీకరించినట్లు సమాచారం. దీంతో మిగిలిన కాలానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధరామయ్య మార్గం సుగమం చేయాల్సి ఉంది. గత ఏడాది నవంబర్ 20న రెండున్నరేండ్ల గడువు ముగియడంతో అధికార పోరు మొదలైనప్పటికీ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధరామయ్య అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

