న్యూఢిల్లీ, జూలై 12: బంగ్లాదేశ్, బ్రిటన్, జపాన్, కెనడా, న్యూజిల్యాండ్, దక్షిణ కొరియా, కెన్యా దేశాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త దౌత్యవేత్తలను నియమించనున్నది. బంగ్లాదేశ్‌కు భారత నూతన హైకమిషనర్‌గా సీనియర్ దౌత్యాధికారి ప్రణయ్ వర్మ నియామకం పొందనున్నట్టు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
ఈయన ప్రస్తుతం వియత్నాం రాయబారిగా ఉన్నారు. ఆయా దేశాల్లో పనిచేస్తున్న పలువురికి స్థాన చలనం ఉంటుందని తెలిపాయి. ఇక బ్రిటన్ రాయబారిగా విక్రం దొరైస్వామి, జపాన్‌కు సీబీ జార్జ్, కెనడాకు సంజయ్ వర్మ, న్యూజిల్యాండ్‌కు నీతూ భూషణ్, దక్షిణ కొరియాకు అమిత్‌కుమార్, కెన్యాకు కొత్త రాయబారిగా నంగ్యా సీ ఖంపా వెళ్లనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.