న్యూఢిల్లీ : మరో మహమ్మారి తరుముకొచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. బ్రెజిల్‌లోని మీసాల గబ్బిలాల్లో బీఆర్జెడ్ బాట్కొవ్ (BRZ batCoV) అనే కరోనా వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీనిలో కొవిడ్-19కు కారణమైన వైరస్ సార్స్ కొవ్2 (SARS-CoV-2) వంటి జన్యుపరమైన మూలకం ఉందన్నారు.
ఈ గబ్బిలాలు లాటిన్ అమెరికాలో విస్తృతంగా ఉంటాయి. బీఆర్జెడ్బాట్కొవ్లో ఫ్యురిన్ క్లెవేజ్ సైట్ అనే మాలిక్యులర్ ఫీచర్ ఉన్నట్లు ఈ అధ్యయనంలో తెలిసింది. మానవ కణాల్లోకి వైరస్లు ప్రవేశించడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది.