న్యూఢిల్లీ: నేపాల్ సెంట్రల్ బ్యాంక్ కొత్తగా విడుదల చేసిన రూ.100 నోట్లు వివాదానికి దారితీశాయి. ఆ కొత్త నోట్లపై సవరించి ముద్రించిన జాతీయ మ్యాప్‌లో భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాదుర ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా చూపించింది. దీంతో గత ఏడాది కాలంగా ఈ సరిహద్దుపై రెండు దేశాల మధ్య జరుగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.