డిల్లీ: ఇయర్ ఎండింగ్, ఫెస్టివల్ హాలీడేస్ వేళ పెద్దఎత్తున షాపింగ్‌కు సిద్ధమయ్యారా? ఇంట్లోనే ఉండి కావాల్సిన వస్తువులు కొనుక్కునేందుకు ఆన్లైన్ షాపింగ్‌ను ఆశ్రయిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! మీరు ఆన్లైన్ షాపింగ్ చేసే సైట్ ఒరిజనలా.. ఫేకా..? అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సిందే.
ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఇప్పటికే 2000 ఫేక్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్‌కు చెందిన వెబ్‌సైట్స్‌ను గుర్తించారు. ఇందులో అమెజాన్, శాంసంగ్, షియోమి, రేబాన్ స్టోర్స్ పేర్లతో నకిలీ సైట్స్ ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే అధ్యయన నివేదికలో తెలిపింది.