న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో మరణించినట్లు వదంతులు వ్యాపించిన నేపథ్యంలో రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల ఉద్రిక్తతలు చోటుచేసుకున్న మరుసటి రోజున ఆయన ఆరోగ్యంపై జైలు పాలనా యంత్రాంగం గురువారం స్పందించింది.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన జైలులోనే సురక్షితంగా ఉన్నారని ఓ ప్రకటనలో జైలు యంత్రాంగం స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యంపై వెలువడిన వదంతులను కొట్టివేస్తూ మాజీ ప్రధానికి పూర్తి వైద్య సహాయం అందుతోందని తెలిపినట్లు జియో న్యూస్ వెల్లడించింది.