ఆయిల్ బాండ్లు జారీ చేయడం లేదు.. ఇంధన ధరలను స్థిరీకరిస్తాం
న్యూఢిల్లీ: ఇంధనం కొనుగోళ్లు, ధరల నియంత్రణకు సంబంధించిన ఇవాళ రాజ్యసభలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హరిదీప్ పురి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్ నుంచి ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరెన్సీ, ఇన్సూరెన్స్, రవాణా ఛార్జీలను బేరేజీ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. డీజిల్ ధరలు తగ్గిస్తారా అని ఎంపీ శక్తి సింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి పురి బదులిస్తూ.. డీజిల్ ధరలను డీరెగ్యులేట్ చేశామన్నారు. సాధారణ ప్రజలకు ఊరటనివ్వాల్సి వచ్చిన సమయంలో అప్పుడు ధరలు తగ్గించినట్లు మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ల కోసం ఆయిల్ కంపెనీలు ఎక్కువ డబ్బులు చెల్లించాయా అని ఎంపీ చాయా వర్మ అడిగారు. కరోనా వేళ ఇంధనంపై అదనపు పన్ను వసూల్ చేశారా కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సివచ్చిందని ఆమె అన్నారు.
ఏ రాష్ట్రాల ఎన్నికలతోనూ ఇంధన ధరలకు లింకు ఉండదని, ఇండియాలో ప్రతి రోజు ఏదో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని మంత్రి తెలిపారు. పెట్రోల్ ధరలు 63 సార్లు, డీజిల్ ధరలు 61 సార్లు పెరిగినట్లు కాంగ్రెస్ ఎం పీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అయితే గత నవంబర్ నుంచి పెట్రోల్ ధరలు పెరగలేదని, ధరలు పెంచకపోవడం సంతోషకరమని, అయితే ధరలను ఇలాగే స్థిరీకరిస్తారా అని ఆయన అడిగారు.
వెనిజులా నుంచి ఇంధనం తీసుకురావడంపై మంత్రి స్పందించారు. ఆ దేశంపై మరో దేశం ఆంక్షలు విధించినట్లు మంత్రి చెప్పారు. అయితే అందుబాటులో ఉన్న ఇతర దేశాల నుంచి ఇంధనం తీసుకునే వీలుందన్నారు. ఓపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిని పెంచాలన్నారు. ఈ దిశగా అంతర్జాతీయ సమాజం చర్చలు చేపడుతోందన్నారు. ఆయిల్ కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ బాండ్లను జారీ చేయడం లేదని మంత్రి పురి స్పష్టం చేశారు. ఇంధన ధరలను స్థిరీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

