Nehru Out Savarkar In | ఆ యాడ్‌లో నెహ్రూ ఔట్.. సావర్కర్ ఇన్.. కర్ణాటకలో వివాదం
Nehru Out Savarkar In | కర్ణాటక సర్కార్ యాడ్‌లో నెహ్రూ ఫొటో తొలిగించి.. సావర్కర్ ఫొటో ప్రచురించింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది.
Nehru Out Savarkar In | ప్రధాని నరేంద్రమోదీ `హర్‌ఘర్ తిరంగా` ప్రచారంలో కర్ణాటక సర్కార్ సరికొత్త వివాదానికి తెర తీసింది. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ఆదివారం జారీ చేసిన ప్రకటన అందుకు కారణమైంది. కర్ణాటకలోని బస్వరాజ్ బొమ్ము సర్కార్ తీరుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మండి పడింది.
సదరు వాణిజ్య ప్రకటనలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫొటోను తొలగించింది కర్ణాటక సర్కార్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కు చెందిన వినాయక్ సావర్కర్‌ను రివల్యూషనరీ సావర్కర్ అని పేర్కొంది. దేశ విభజనలో సంస్మరణ రోజు ( Partition Horrors Remembrance Day ) అనే పేరుతో జారీ చేసిన పూర్తి పేజీ వాణిజ్య ప్రకటనలో ఈ వివాదం చోటు చేసుకున్నది.
దేశ విభజనకు పండిట్ నెహ్రూ, పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా బాధ్యత వహించాలంటూ అధికార బీజేపీ ట్వీట్ చేసిన వీడియోపై అధికార బీజేపీ.. కాంగ్రెస్ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని తన రాజకీయ యుద్ధాలకు బాధాకరమైన చారిత్రక ఘటనలను ఉపయోగించుకుని విభజన ఘోరాల సంస్మరణ దినోత్సవం.. ఆగస్టు 14 అంటూ వాడుకోవడంలో నిజమైన ఉద్దేశాలు అర్థం అవుతున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
ఝాన్సీరాణి, గాంధీ, సావర్కర్ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. నెహ్రూ దేశ తొలి ప్రధాని అయినా.. దేశ విభజనకు కారణమయ్యారని బీజేపీ అధికార ప్రతినిధి రవి కుమార్ అన్నారు. అందువల్లే వాణిజ్య ప్రకటన నుంచి నెహ్రూ ఫొటో తొలగించినట్లు తెలిపారు.
Sorry Nehru is not a freedom fighter but Savarkar is. 🤷🏻♀️ pic.twitter.com/m6sZ7YOuAf
— Savukku Shankar (@SavukkuOfficial) August 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- karnataka
- Pandit Nehru
- Savarkar
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

