NEET UG | నీట్ యూజీ సవరించిన ఫలితాలు విడుదల.. 5 మార్కులు కోల్పోయిన 4 లక్షల మంది విద్యార్థులు
NEET UG | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ తుది ఫలితాలు (NEET UG results) విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం సవరించిన ఫలితాలను విడుదల చేసింది.
NEET UG | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ తుది ఫలితాలు (NEET UG results) విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం సవరించిన ఫలితాలను విడుదల చేసింది. నీట్ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు రావని సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీయే వ్యవహరించింది. ఈ నిర్ణయంతో 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. సవరించిన ఫలితాలను ఎన్టీయే అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.
సుప్రీం తీర్పు..
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ లీకేజీ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్ లీక్ అయిందని పేర్కొన్నది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు మే 5న నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని, మరోసారి పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేడీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
ఆ నీట్ ప్రశ్నకు ఒక్కటే సమాధానం!
నీట్ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానంపై ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కటేనని స్పష్టం చేసింది. సంబంధిత ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో నాలుగోది మాత్రమే సరైన సమాధానం అని ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ తేల్చిందని ధర్మాసనం తెలిపింది. ‘స్టేట్మెంట్ 1 కరెక్ట్.. స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాదు’ అని ఆ నాలుగో ఆప్షన్ చెబుతున్నదని పేర్కొన్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా 4వ ఆప్షన్నే సరైన సమాధానంగా ఆన్సర్ కీలో సవరించాలని తెలిపింది. ప్రశ్న నంబర్ 29కు నాలుగో ఆప్షన్ మాత్రమే సరైన సమాధానమని తేల్చింది. ఈ నేపథ్యంలోనే సవరించిన ఫలితాల్లో నాలుగు లక్షల మంది ఐదు మార్కులను కోల్పోవాల్సి వచ్చింది.
Also Read..
Rashtrapati Bhavan | రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మార్పు
Mumbai Rains | ముంబై జలదిగ్బంధం.. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

