UPSC | పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు యూపీఎస్సీ శ్రీకారం.. అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్, ఫేషియల్ రికగ్నిషన్..!
UPSC | నీట్ - యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులకు శ్రీకారం (revamp its exam system) చుట్టింది.
UPSC | నీట్ – యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహణలో ఎన్నో లోపాలున్నాయని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులకు శ్రీకారం (revamp its exam system) చుట్టింది. ఇందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని (new technology) ఉపయోగించాలని నిర్ణయించింది.
అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ అథెంటికేషన్, ఫింగర్‌ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్ వంటి చర్యలతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని యోచిస్తోంది. సీసీ కెమెరాలతో నిఘా పెంచడం, అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని వినియోగించడం, ఈ-అడ్మిట్ కార్డ్‌లపై QR కోడ్ స్కానింగ్ వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది.
యూపీఎస్సీ (UPSC) ఏటా 14 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. వీటితో పాటుగా ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తోంది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల సమయంలో సాంకేతిక సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను బిడ్స్‌కు ఆహ్వానిస్తూ టెండర్ దాఖలు చేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పరీక్షల ఆధారిత ప్రాజెక్టుల ద్వారా కనీసం రూ.100 కోట్లు సగటు టర్నోవర్ కలిగి ఉన్న సంస్థలు మాత్రమే బిడ్ వేయాలని యూపీఎస్సీ తన టెండర్లో స్పష్టం చేసింది. అదేవిధంగా, పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్, ఎగ్జామ్ సెంటర్ల జాబితా, ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు వంటి వివరాలను పరీక్షకు రెండు లేదా మూడు వారాల ముందు సర్వీస్ ప్రొవైడర్లకు అందజేస్తామని పేర్కొంది.
Also Read..
Russian Helicopter | కుప్పకూలిన రష్యన్ హెలికాప్టర్.. సిబ్బంది మృతి
Manali | మనాలీలో మెరుపు వరదలు.. ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలు
Droupadi Murmu | పంతులమ్మ అవతారమెత్తిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

