Kota | కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం.. రెండు రోజుల్లో రెండో ఘటన
రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతున్నది.
జైపూర్: రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో రెండు రోజుల్లోనే ఇద్దరు చనిపోయినట్లయింది. మొత్తంగా కోటాలో ఈ ఏడాది ఇది ఎనిమిదో ఆత్మహత్య. కాగా, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు కోటాకు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ నెల 25న ఉరుజ్ ఖాన్ అనే నీట్ విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. అతడు కూడా యూపీకి చెందినవాడే కావడం గమనార్హం. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతేడాది కోటాలో 29 మంది ఆత్మహ్య చేసుకున్నారు. వారంతా నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నవారే కావడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

