NEET PG 2025 Results | న్యూఢిల్లీ, ఆగస్టు 19 : ఎండీ, ఎంఎస్ సహా వివిధ రకాల పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పించే ‘నీట్ పీజీ-2025’ పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నీట్ పీజీ పోర్టల్, NBEMS, natboard. edu.in వెబ్సైట్ల నుంచి అభ్యర్థులు తమ వ్యక్తిగత ఫలితాల్ని, ఓవరాల్ ర్యాంక్‌ను నేరుగా పొందవచ్చునని ది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ (ఎన్బీఈఎంఎస్) తెలిపింది.
జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి-276 మార్కులు, జనరల్ పీడబ్ల్యూబీడీ-255, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-255 మార్కులను కటాఫ్‌గా ఎన్బీఈఎంఎస్ పేర్కొన్నది. అడ్మిషన్ పొందేందుకు దీనిని కనీస అర్హతగా తెలిపింది. నీట్ పీజీ పరీక్షను ఆగస్టు 3న నిర్వహించారు.