పాట్నా: నీట్ వివాదం (NEET row) బీహార్‌లో బీజేపీ, ఆర్జేడీ మధ్య రాజకీయంగా చిచ్చు రేపుతున్నది. నీట్ పేపర్ లీక్‌లో అరెస్టయిన ప్రధాన నిందితుడికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడితో సంబంధం ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా గురువారం ఆరోపించారు. అయితే ఆర్జేడీ దీనికి కౌంటర్ ఇచ్చింది. మరో నిందితుడు అమిత్ ఆనంద్ మరో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరితో ఉన్న ఫొటోను శుక్రవారం విడుదల చేసింది. నిందితుడు మంత్రిని సత్కరించాడని ఆరోపించింది. ‘నీట్ పరీక్ష పేపర్ లీక్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు బీహార్ ఉప ముఖ్యమంత్రితో కలిసి ఉన్నాడని ట్వీట్ చేసింది.
కాగా, నిందితుడితో ఉన్న ఫొటోలన్నింటినీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలగించారని ఆర్జేడీ విమర్శించింది. ‘నిందితుడు సత్కరించిన శక్తివంతమైన మంత్రి తన సోషల్ మీడియా నుంచి అతనితో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించారు. కానీ చింతించకండి, అవన్నీ మా వద్ద ఉన్నాయి. ఆందోళనలో ఉన్న మీ ఇతర డిప్యూటీ సీఎం (విజయ్ కుమార్ సిన్హా) కు దీనిని పంపండి’ అని ఆ ట్వీట్లో ఆర్జేడీ పేర్కొంది.
नीट परीक्षा पेपर लीक घोटाले का मुख्य आरोपी बिहार के उपमुख्यमंत्री के साथ।
आरोपी के हाथों सम्मानित होने वाले तथाकथित ताकतवर मंत्री ने अपने सोशल मीडिया हैंडल से उसके साथ अपनी सारी तस्वीरें डिलीट कर दी लेकिन चिंता की कोई बात नहीं हमारे पास सभी है। आपके व्याकुल समकक्ष दूसरे… pic.twitter.com/R6brf91Br3
— Rashtriya Janata Dal (@RJDforIndia) June 21, 2024