పనాజీ: గోవాలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హంగ్‌కు అవకాశమున్నదని అంచనా వేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు 13-17 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆప్‌కు 2-6 సీట్లు, తృణమూల్-ఎంజీపీ కూటమికి 2-4 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
టైమ్స్ నౌ వీటో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 16 సీట్లు, కాంగ్రెస్‌కు 17, ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 2 సీట్లు, ఇతరులకు 5 సీట్లు వస్తాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 14-18, కాంగ్రెస్ మిత్రపక్షాలకు 15-20, తృణమూల్-ఎంజీపీ కూటమికి 2-5, ఇతరులకు 0 నుంచి 4 సీట్లు రావచ్చని అంచనా వేసింది.
ఏబీపీ న్యూస్ సీ-వోటర్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం 13-17 స్థానాలతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుంది. 12-16 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుంది. గోవాలో రెండవ సారి పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ కూటమికి 5-9 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి.