సోమవారం 25 జనవరి 2021
National - Jan 05, 2021 , 13:45:50

వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌తో 400 కాకులు మృతి

వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌తో 400 కాకులు మృతి

భోపాల్‌: రాజ‌స్థాన్‌లో ఏవియ‌న్ ఫ్లూ కార‌ణంగా కాకుల మ‌ర‌ణాలు కొన‌సాగుతుండ‌గానే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా కాకులు మృతిచెందుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ‌రుస‌గా కాకులు మ‌ర‌ణిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 400 కాకులు మృత్యువాత‌ప‌డ్డాయి. అయితే, ఒక‌ కొత్త ర‌కం వైర‌స్ కార‌ణంగా ఈ కాకుల మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ట్లు త‌మ వైద్యాధికారుల ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్  ఆర్‌కే రోక్డే చెప్పారు. 

ఈ కొత్త వైర‌స్ ప్ర‌భావం పౌల్ట్రీల్లో క‌నిపించ‌డంలేద‌ని, కేవ‌లం గాల్లో ఎగిరే ప‌క్షుల్లోనే ఉన్న‌ద‌ని రోక్డే తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఎనిమిది జిల్లాలో వైర‌స్ ప్రభావం క‌నిపిస్తున్న‌ద‌ని చెప్పారు. ఈ వైర‌స్ రాజ‌స్థాన్ నుంచి వ‌చ్చి ఉంటుంద‌ని, ప్ర‌స్తుతం దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేద‌ని రోక్డే వెల్లడించారు.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo