న్యూఢిల్లీ: గత ఏడాది దేశవ్యాప్తంగా 30.5 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయని, 286 మంది మరణించారని మంగళవారం లోక్సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ‘కుక్కల దాడుల ఘటనలను అరికట్టాలంటే వాటి జనాభా నియంత్రణ ముఖ్యమైంది. స్థానిక ప్రభుత్వాలు కుక్కల జనాభా నియంత్రణ, యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ చేపడతున్నాయి. ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన మార్గదర్శకాలు కూడా జారీచేస్తున్నాం’ అని వివరించారు.