ఆకాశ విమానాన్ని ఢీకొన్న స్పైస్ జెట్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు సిద్ధమవుతున్న ఆకాశ ఎయిర్ విమానాన్ని, అదే సమయంలో పార్కింగ్ వైపు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్ విమానం తాకుతూ వెళ్లింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు సిద్ధమవుతున్న ఆకాశ ఎయిర్ విమానాన్ని, అదే సమయంలో పార్కింగ్ వైపు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్ విమానం తాకుతూ వెళ్లింది. ఈ ఘటనలో స్పైస్‌జెట్ విమానం కుడి వైపు వింగ్లెట్ దెబ్బతినగా, ఆకాశ ఎయిర్ విమానం ఎడుమవైపు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది.
వెంటనే స్పందించిన విమానాశ్రయ అధికారులు, ఆకాశ ఎయిర్ విమానంలోని ప్రయాణికులు, ఇతర సిబ్బందిని కిందికి దింపారు. ప్రయాణికులను హైదరాబాద్‌కు పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ‘ఆకాశ ఎయిర్’ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టామని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద కారణంగా రెండు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

