న్యూఢిల్లీ: దీపావళి పండుగకు గ్రీన్ ఫైర్‌క్రాకర్స్ (పర్యావరణ హిత)ను ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని రాష్ర్టాలు శుక్రవారం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశాయి.
ఎన్సీఆర్ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో మాట్లాడుతూ దీపావళి రోజున పర్యావరణ హిత పటాకులను రాత్రి 8-10 గంటల మధ్య కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ‘కనీసం పిల్లలనైనా రెండు రోజుల పాటు దీపావళి వేడుకను చేసుకోనిద్దాం’ అని ఆయన అన్నారు.