Worli Hit And Run Case : వర్లీ హిట్ అండ్ రన్ కేసుపై ఎన్సీపీ-ఎస్సీపీ నేత జితేంద్ర అవద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, అధికారంలో ఉన్న వ్యక్తులు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వారు దేని గురించి కలత చెందడం లేదని చెప్పారు. మహిళను కిలోమీటర్ల దూరం లాక్కెళ్లడం సిగ్గుచేటని, ఘటన అనంతరం నిందితుడు కారును వదిలేసి పరారయ్యాడని అన్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత కుమారుడు (Shinde Sena Leader’s Son) మద్యం సేవించి బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేస్తూ స్కూటర్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది.
ఈ ప్రమాదంలో మహిళ మరణించగా ఆమె భర్త గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శివసేన నేత కుమారుడి కోసం వెతుకుతున్నారు. ఇక ఈ ఘటనపై శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ స్పందించారు. యూపీలోని వారణాసిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గూండాల ముఠా నడుపుతున్నదని తీవ్ర విమర్వలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు సజావుగా సాగితే మిహిర్ షాను అరెస్ట్ చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
Read More :