Sharad Pawar | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేయండి.. కేంద్ర సర్కారుపై శరద్‌పవార్ ఆగ్రహం
Sharad Pawar | ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) డిమాండ్ చేశారు. రైతు కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
నాసిక్: ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) డిమాండ్ చేశారు. రైతు కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా చంద్వాడ్ గ్రామానికి చెందిన ఉల్లి రైతులు చేపట్టిన నిరసనలో పవార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులంతా ఏకమై హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఉల్లి రైతులు పంట కోసం ఆరుగాలం శ్రమించే చిన్న రైతులని, వారికి నష్టం జరిగే పనులను కేంద్రం మానుకోవాలని ఆయన హితవుపలికారు. తాను కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో పెరిగిన ఉల్లి ధరలను తగ్గించడం గానీ, ఎగుమతులపై నిషేధం విధించడం గానీ చేయలేదని గుర్తుచేశారు.
ఉల్లి ఎగమతులపై నిషేధాన్ని కేంద్రం తక్షణమే వెనక్కు తీసుకోవాలని పవార్ కోరారు. ద్రాక్షపై రూ.160 మేర బంగ్లాదేశ్ దిగుమతి సుంకం విధించిందని, దాంతో ద్రాక్ష రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. కాగా, దేశీయంగా లభ్యతను పెంచడంతో పాటు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని పలుచోట్ల ఉల్లి రైతులు నిరసనలకు దిగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

