LSD Drug: 11 కోట్ల విలువైన ఎల్ఎస్డీ స్వాధీనం.. భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
LSD drug: ఎల్ఎస్డీని లైసెర్జిక్ యాసిడ్ డైథిలమైడ్ అంటారు. ఇదో సింథటిక్ డ్రగ్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇంత భారీ స్థాయిలో ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకోవడం గత రెండు దశాబ్ధాల్లో ఇదే మొదటిసారి అని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ: భారీ డ్రగ్ రాకెట్‌ను ఎన్సీబీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. గత రెండు దశాబ్ధాల కాలంలో ఇదే అతిపెద్ద రాకెట్‌గా భావిస్తున్నారు. డార్క్ నెట్, క్రిప్టోల ద్వారా జరుగుతున్న ఎల్ఎస్డీ డ్రగ్స్(LSD Drugs) సరఫరాను పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగుర్ని అరెస్టు చేశారు. దాదాపు 15 వేల డ్రగ్స్ ప్యాకేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఎస్డీని లైసెర్జిక్ యాసిడ్ డైథిలమైడ్ అంటారు. ఇదో సింథటిక్ డ్రగ్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇంత భారీ స్థాయిలో ఎల్ఎస్డీని స్వాధీనం చేసుకోవడం గత రెండు దశాబ్ధాల్లో ఇదే మొదటిసారి అని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు.
#WATCH | We've arrested 6 persons in two cases and seized 15,000 bloats of LSD drug which is 2.5 thousand more than the commercial quantity. The commercial quantity of this drug is .1 gram. It's a synthetic drug and is very dangerous. It's the biggest seizure in the last 2… pic.twitter.com/Qes0uU816O
— ANI (@ANI) June 6, 2023
డ్రగ్స్ సిండికేట్ గురించి పోలీసులు వివరించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా డ్రగ్స్ ఎర వేస్తారు. ఎవరైతే ఆసక్తి చూపుతారో.. వాళ్లను విక్కర్ మీ అనే ప్రైవేటు మెసేజింగ్ యాప్‌లోకి ఆహ్వానిస్తారు. అక్కడ డీల్ జరుగుతుంది. క్రిప్టోల ద్వారా ఎల్ఎస్డీ కోసం పేమెంట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ డ్రగ్స్‌ను నెదర్లాండ్స్ లేదా పోలాండ్ నుంచి దిగుమతి చేస్తారు. తాజాగా సీజ్ చేసిన ఎల్ఎస్డీ డ్రగ్స్ మార్కెట్ విలువు 11 కోట్లు ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

