న్యూఢిల్లీ, మార్చి 9: దేశంలో భారీ మాదక దవ్య్రాల అక్రమ రవాణా సూత్రధారి అయిన ఒక తమిళ సినీ నిర్మాతను నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న డీఎంకే మాజీ నేత, సినీ నిర్మాత జాఫర్ సిద్ధిక్‌ను అరెస్ట్ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శనివారం వెల్లడించింది.
కాగా అరెస్టయిన జాఫర్ తాను తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు 7 లక్షల రూపాయలు (వరద సహాయ నిధికి రూ.5 లక్షలు, పార్టీ నిధికి రూ.2 లక్షలు) ఇచ్చినట్టు దర్యాప్తు అధికారులకు తెలపడం సంచలనం సృష్టించింది.