ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ఆదివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. శనివారం రాత్రి ముంబై తీరంలో క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీ( Rave party )కి సంబంధించి ఉదయం నుంచీ ఆర్యన్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ.. సాయంత్రం అరెస్ట్ చేసింది. అతనితోపాటు స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలను కూడా అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. క్రూజ్ షిప్లో నిషేధిత డ్రగ్స్ లభించినట్లు ఎన్సీబీ వెల్లడించింది.
ఇందులో ఆర్యన్‌తోపాటు పలువురు వ్యాపార ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. శనివారం క్రూజ్ షిప్‌పై దాడి చేసిన సమయంలో ఆర్యన్ ఖాన్ అందులోనే ఉన్నాడు. అయితే తాను ఓ గెస్ట్‌గా మాత్రమే అక్కడికి వెళ్లినట్లు విచారణలో ఆర్యన్ చెప్పినట్లు సమాచారం. నిజానికి ఈ రేవ్ పార్టీకి సంబంధించి 15 రోజుల ముందే ఎన్సీబీకి సమాచారం ఉన్నా.. అందులో సెలబ్రిటీల పిల్లలు ఉంటారని మాత్రం వాళ్లకు తెలియలేదు. అరెస్ట్ చేసిన తర్వాత ఆర్యన్‌తోపాటు అతని స్నేహితుడు అర్బాజ్, మున్మున్ ధమేచాలను ఆరోగ్య పరీక్షల కోసం తీసుకెళ్లారు.
#WATCH | Mumbai: Three of the eight detained persons, in connection with the raid at a party at a cruise off the Mumbai coast, were being taken for the medical test by NCB pic.twitter.com/JVAYF6fMb5
— ANI (@ANI) October 3, 2021
Maharashtra: Aryan Khan, Arbaz Seth Merchant and Munmun Dhamecha, who were detained in connection with the raid at a party at a cruise off the Mumbai coast, were taken out of the NCB office for medical examination pic.twitter.com/6goZ9aIOZE
— ANI (@ANI) October 3, 2021