JNVST 2024 | న్యూఢిల్లీ : 2024-25 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా 649 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి సీట్ల భర్తీకి రెండు విడుతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఉదయం 11:30 గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో, 2024 జనవరి 20న తెలంగాణ, ఏపీతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు తెలంగాణలో 9, ఏపీలో 15 ఉన్నాయి.