అమరావతి, అక్టోబర్ 30 : నటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణాకు మరోసారి హత్య, సామూహిక లైంగికదాడి బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర, అమరావతిలోని ఆమె కార్యాలయానికి స్పీడ్ పోస్ట్‌లో ఈసారి బెదిరింపులు వచ్చాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కూడా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి.
దీనిపై ఆమె పీఏ ఫిర్యాదు చేయడంతో రాజ్‌పథ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జావెద్ పేరిట హైదరాబాద్ నుంచి ఈ లేఖ వచ్చినట్టు గుర్తించారు. దీంతో హైదరాబాద్, అమరావతి పోలీసులు సంయుక్తంగా బెదిరింపులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే తరహాలో బెదిరిస్తూ అమీర్ పేరిట ఆమెకు ఒక లేఖ అందింది. అందులో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడమే కాక, 10 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.