Navjot Singh Sidhu: దమ్ముంటే అమృత్సర్ ఈస్ట్ నుంచి మాత్రమే బరిలో దిగు.. మజీతియాకు సిద్ధూ సవాల్
Navjot Singh Sidhu: శిరోమణి అకాలీదళ్ పార్టీ కీలక నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియాపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ( Navjot Singh Sidhu ) మండిపడ్డారు. మజీతియాకు దమ్ముంటే

చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ పార్టీ కీలక నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియాపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ( Navjot Singh Sidhu ) మండిపడ్డారు. మజీతియాకు దమ్ముంటే కేవలం తాను పోటీచేస్తున్న అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి మాత్రమే బరిలో దిగాలని సవాల్ విసిరారు. మజీతా స్థానంలో పోటీ నుంచి తప్పుకోవాలన్నారు.
సిద్ధూకు తన సొంత నియోజకవర్గమైన అమృత్సర్ ఈస్ట్‌లో బలమైన పోటీ ఇవ్వడానికి శిరోమణి అకాలీదళ్ పార్టీ మజీతియాను రంగంలోకి దించింది. అయితే బిక్రమ్ సింగ్ మజీతియా కేవలం అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి మాత్రమేగాక, మజీతా నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తున్నారు. ఈ మేరకు రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు కూడా వేశారు.
ఈ క్రమంలో మజీతియాపై సిద్ధూ విమర్శలు చేశారు. తనపై కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం లేకనే మజీతియా అమృత్సర్ ఈస్ట్‌తోపాటు ఆయన సొంత నియోజకవర్గం మజీతా నుంచి కూడా బరిలో దిగుతున్నాడని ఎద్దేవా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

