న్యూఢిల్లీ, జనవరి 26 : దేశవ్యాప్తంగా గిగ్, ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్లు సోమవారం ఆన్లైన్ నిరసన ప్రారంభించారు. ఫిబ్రవరి 3 నుంచి భౌతికంగా సమ్మెలోకి దిగడానికి ముందు ఆన్లైన్ నిరసనను ప్రారంభించిన గిగ్, ప్లాట్ఫామ్ సర్వీసు వర్కర్లు తమ మొబైల్ యాప్ల డీయాక్టివేషన్ చేపట్టారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీసు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కేవలం డెలివరీ గడువు గురించి మాత్రమే కాక తమను కార్మికులుగా గుర్తించాలని, జీవనభద్రత కల్పించాలని, తమ పట్ల గౌరవంగా వ్యవహరించాలని, మహిళా వర్కర్లకు భద్రత కల్పించాలని వారు డిమాండు చేస్తున్నారు.
భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న సమయంలో గిగ్, ప్లాట్ఫామ్ సర్వీసు వర్కర్ల సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. సమ్మెతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.