న్యూఢిల్లీ, మార్చి 14: నెలకు రూ.7,500 పింఛనుతోపాటు డీఏ ఇవ్వాలనే డిమాండ్‌తో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)-1995 పరిధిలోని పింఛనుదారులు బుధవా రం ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా 200 నగరాల్లో ఆందోళనలు చేపట్టనున్నారు. అధిక పింఛను, డీఏతోపాటు కుటుంబసభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలనే డిమాండ్‌తో ఈపీఎస్-95 లబ్ధిదారులు దేశవ్యాప్త ఆందోళనలకు నిర్ణయం తీసుకొన్నారు.
ఈపీఎస్-95 లబ్ధిదారులకు న్యాయం కోసం ఏడేండ్లుగా ఆందోళన కొనసాగుతున్నదని నేషనల్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అశోక్ రౌత్ పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రధాని మోదీని రెండుసార్లు కలిశామని, ఆయన హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. ప్రస్తుతమిస్తున్న పింఛన్ రూ.1,171 ఎంతమాత్రం సరిపోదని, అత్మగౌరవంతో బతికేందుకు రూ.7,500కు పెంచాలని కోరారు.