జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే విషయంపై కేంద్రం ఆలోచన చేస్తున్నదనేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హింట్ ఇచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా’ అని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే విషయంపై కేంద్రం ఆలోచన చేస్తున్నదనేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హింట్ ఇచ్చారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా’ అని తెలిపారు.
గుజరాత్ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. రూ.500కే సిలిండర్, యువతకు 10 లక్షల ఉద్యోగాలు తదితర ఎనిమిది హామీలతో మ్యానిఫెస్టోను ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
పోక్సో చట్టంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పోక్సో చట్టంలో వయసు విషయంలో పునరాలోచన చేయాలని భారత న్యాయ కమిషన్‌కు సూచించింది.
దాదాపు 5 కోట్ల కొవాగ్జిన్ డోసులు నిరుపయోగంగా మారనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో వీటి వినియోగ గడువు పూర్తవుతుందని, తద్వారా నిరుపయోగంగా మారుతాయని అధికార వర్గాలు తెలిపాయి.
నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి గర్భాన్ని కోల్పోయింది. తీవ్ర ఒత్తిడి కారణంగానే గర్భాన్ని కోల్పోయినట్టు అధికారులు భావిస్తున్నారు.
తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ భారత్‌కు చెందిన 15 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వారి పడవలను కూడా స్వాధీనం చేసుకున్నది.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. దుండగులు ఎందుకు కాల్పులు జరిపారో తెలియరాలేదని వెల్లడించారు.
ఇండియన్ రైల్వేస్‌కు వినియోగదారుల కమిషన్ ఝలక్ ఇచ్చింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ పనిచేయకపోవడంపై కమిషన్‌ను ఆశ్రయించిన ఓ ప్రయాణికుడికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పుచెప్పింది. బాధితుడి మానసిక వేదనకు రూ.30 వేలు, పిటిషన్ ఖర్చుల కింద రూ.20 వేలు అందజేయాలని రైల్వే శాఖను ఆదేశించింది.
భారత్‌కు అత్యధికంగా అక్టోబర్‌లో ఆయిల్ సరఫరా చేసిన దేశంగా రష్యా నిలిచింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆయిల్ దిగుమతుల్లో రష్యాది 0.2 శాతం మాత్రమే ఉండగా.. అక్టోబర్‌లో రోజుకు 9,35,556 బ్యారెళ్ల (22 శాతం) క్రూడాయిల్‌ను సరఫరా చేసింది.
ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్2022లో రిలయన్స్‌కు 20వ స్థానం లభించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, అల్ఫాబెట్, యాపిల్ కంపెనీలు ఉన్నాయి.
వాతావరణ మార్పులను పరిశీలిస్తే 2015 నుంచి 2022 వరకు అంటే.. 8 ఏండ్లు సూర్యుడు భగ భగ నిప్పులు కురిపించాడని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొన్నది. ఇలాగే కొనసాగితే పెనుముప్పు తప్పదని హెచ్చరించింది.